లక్ష్యంన్యూస్: వలస కార్మికుల సహాయార్థం 1200 నిత్యవసర కిట్లను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ విభాగం అందజేసింది.
కోవి డ్ -19 కారణంగా లాక్ డౌన్ లో ఉన్న వలస కార్మికులకు మరియు నిరుపేదల సహాయార్థం ఎల్ అండ్ టి హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను కలిసి వలస కార్మికుల కు పంపిణీ నిమిత్తం తయారుచేసిన నిత్యవసర వస్తువుల కిట్లను అందజేశారు. ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ,కేజీ గోధుమపిండి ,1 లీ ఆయిల్ ఒక్కొక్క కిట్ చొప్పున ఉండే 1200 కిట్ల ను పంపిణీ చేయనున్నట్లు ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ సిబ్బంది సురేష్ బాబు , ఎస్ ఎన్ రావు, పిడి వర్మ, కె ఎస్ ఎన్ కుమార్ కలెక్టర్ కు తెలిపారు.