గొడుగు..కరోనాపై పిడుగు : డాక్టర్ కూటికుప్పల


లక్ష్యంన్యూస్, విశాఖపట్నం :  ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ..కంటికి కనబడని శత్రువు కరోనాను ఎదుర్కోవాలంటే..ప్రతీ ఒక్కరూ  గొడుగు అనే ఆయుధం ఉపయోగించాలని ప్రముఖ వైద్యనిపుణులు పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు అన్నారు. వైజాగ్ న్యూస్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద  సోమవారం జరిగిన కార్యక్రమంలో కూటికుప్పల గొడుగు సిద్ధాంతం పై అవగాహన కల్పించారు.గొడుగు వాడడం వలన మనిషి కి మనిషికి మధ్య దూరం పెరిగి  కోవిడ్-19 వైరస్ దరి చేరకుండా....ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించవచ్చని తెలిపారు. కేరళ వంటి రాష్ట్రాల్లో..గొడుగు వినియోగం తప్పనిసరి చేసి...గొడుగుల మధ్య దూరం పాటించాలని అక్కడి ప్రభత్వం చర్యలు తీసుకుంటోంది.. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కూటికుప్పల గొడుగు సూత్రాన్ని ప్రపంచ దేశాలు ఆహ్వానిస్తున్న తరుణంలో ...విశాఖలో గొడుగు వినియోగం పై మరింత వేగంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జనం గుమిగూడి ఉండే ప్రదేశాల్లో డాక్టర్ సూర్యారావు..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జర్నలిస్టులు, పోలీస్ సిబ్బంది, న్యూస్ రీడర్స్ కు గొడుగు లు పంపిణీ చేసి..వారి ద్వారా సమాజంలో అవగాహన పెంచుతుండడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో విశాఖ న్యూస్ రీడర్స్ అసోసియేషన్ అధ్యక్ష , కార్యదర్శులు, లక్ష్మీ నారాయణ, వరలక్ష్మీ, సీనియర్ జర్నలిస్ట్ నాగనబోయిన నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.