ముస్లిం సోదరులకు ఎంపీ కూరగాయలు పంపిణీ
లక్ష్యంన్యూస్ : లాక్డౌన్ నేపథ్యంలో పరమ పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం లు ఎవరి ఇంటివద్ద వారే నిర్వహించుకుని ప్రార్ధనలు చేసుకోవాలని విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ అన్నారు. విశాఖ ఎంపీ సొంత నిధులతో పాటు హీరాపన్న జువెలర్స్ సంయుక్త నిర్వహణలో రూ.2
లక్ష ల రూపాయల విలువైన కూరగాయలు సుమారు 2 వేల మంది కి వార్డు పరిధిలో అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన పార్లమెంట్ నియోజక వర్గ
.పరిధిలో ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రయత్నిస్తున్నామన్నారు.. ఈ కష్టకాలం లో ప్రజలకు తాము తోడుగావుంటానన్నారు. ఈ క్రమంలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి వార్డ్ లో ఉన్న ముస్లింలకు కూరగాయలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మహేంద్ర కుమార్ జైన్ ,గోలగాని హరి,వెంకటకుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం సోదరులకు ఎంపీ కూరగాయలు పంపిణీ