వంశీకృష్ణ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్ల పంపిణీ 


లక్ష్యంన్యూస్, విశాఖపట్నం : నేతాజీనగర్ లో వైసీపీ నగర అధ్యక్షులు  వంశీకృష్ణ శ్రీనివాస్  చేతులమీదుగా సోమవారం భోజనం ప్యాకెట్లను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఖాజా రహమ్ తుల్లా ఆధ్వర్యంలో ఆశాజ్యోతి ఫౌండేషన్ వారి సహకారంతో 250మందికి ఆహార ప్యాకెట్లను అందజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అందరూ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు లో ధైర్యంగా కరోనా ను ఎదుర్కోవాలని అన్నారు. కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు రవికుమార్, అభిమదద్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు,  మదీన బాషా తదితరులు పాల్గొన్నారు