ఏపీ పరిస్థితులపై కేంద్రం ఆరా

లక్ష్యంన్యూస్ : ముుఖ్యమంత్రి జగన్ కు  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. లాక్‌డౌన్‌ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఏపీలో తీసుకుంటున్న చర్యలను ఫోన్ ద్వారా జగన్‌ వివరించారు. రాష్ట్రంలో విస్తృతంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి మిలియన్‌ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రథమస్థానంలో ఉందని అమిత్‌షాకు జగన్ చెప్పారు. ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపుల ప్రభావంపై చర్చించినట్లు తెలిసింది.